TEJA NEWS

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం.
సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

హన్మకొండ లో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో మేడ్చల్ జిల్లా తరపున పార్టీ రిపోర్ట్ ను ప్రవేశపెడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్నీ బీజేపీ నాయకులు వక్రీకరిస్తూ కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే వచ్చిందని ప్రచారం చేస్తున్నారని కానీ పటేల్ సైన్యం కమ్యూనిస్టులను చంపి రజాకార్ల నాయకుడు కాశిం రాజ్వి పాకిస్తాన్ పరిపోయేలా చేసి,నిజాం తెలంగాణ ప్రజలను హింసించి,బట్టలు విప్పి బతుకమ్మ ఆడించిండు అని ప్రచారం చేస్తు,ఆ నిజాం ను దేశ్ ప్రముక్కగా పదవి ఇచ్చి,పారితోషకం ఇచ్చి న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసారని ప్రశ్నించారు.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపి 4500 మంది కార్యకర్తల బలిదానాలు ఇచ్చి,10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సీపీఐ కె ఉందన్నారు. నేటికి తెలంగాణ పలు జిల్లాల్లో వీరులను స్మరించుకుంటారని ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా సాయుధ పోరాట వారోత్సవాలను మరింత ఉత్సాహంగా నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా జాతీయ కార్యదర్శి నారాయణ,మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్ పాషా,రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS