TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఉషాముళ్ళపూడి కమాన్ వద్ద క్షత్రియ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు, బాటసారులకు అందచేశారు..

ఈ   సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ గారు మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని  ప్రజలు ఎండలకు నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, చలివేంద్రం ను ఏర్పాటు చేయడం చాలా అభినదించదగ్గ విషయం అని, చలివేంద్రాలు ప్రజల దాహాన్ని తీర్చడానికి ఎంతో దోహద పడుతాయని మరియు బాటసారులు ,వాహనదారుల దాహాన్ని తీరుస్తాయి అని,ప్రజలందరూ ఉపయోగించుకోవాలని .చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం మంచికార్యక్రమం అని వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చడం గొప్ప విషయం అని, అన్ని దానల కన్నా నీటి దానం చాల  గొప్పదని ఎమ్మెల్యే గాంధీ గారు పేర్కొనడం జరిగినది .వేసవి కాలంలో .ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి చలి వేంద్రలు ఏర్పాటు చేయడం మంచి  కార్యక్రమం అని  ఈసందర్బంగా చలి  వేంద్రం ఏర్పాటు  చేసిన నిర్వాహకులను క్షత్రియ యూత్ అసోసియేషన్ వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గాంధీ గారు అభినదించడం జరిగినది .అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి చలి వేంద్రలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గాంధీ గారు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS