సీఎం హోదాలో తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు
హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ :
ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న చంద్రబా బు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయు డు.. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు పలువురితో భేటీ అయ్యారు.
ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. సాయంత్రం 6గంటల సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకుంటారు.
రెండోసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ శ్రేణులు, నారా, నందమూరి కుటుంబాల అభిమానులు సిద్ధమ య్యారు.
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయిం చారు. దీంతో బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు రహదారి పసుపుమయంగా మారింది.
టీడీపీ ప్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. అయితే, టీటీడీపీ నేతల ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పలు సూచనలు చేశారు.
300 మందికి మించి ర్యాలీలో పాల్గొనవద్దని, ర్యాలీలో డీజేలు, పేపర్ స్ర్పే గన్స్ వాడొద్దని, రాత్రి పొద్దుపోయే వరకు ర్యాలీ నిర్వహించొద్దని సూచనలు చేశారు. దీంతో సాయంత్రం 6 నుంచి 8గంటల వరకు ర్యాలీకి తెలంగాణ టీడీపీ నేతలు ప్రణాళికలు చేసు కున్నారు.
సాయంత్రం 6గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు.. అతి తక్కువ మంది నాయకులతో ఎయిర్ పోర్టులో భేటీ కానున్నారు. ఇందుకోసం 40 మంది తెలంగాణ తెలుగుదేశం నాయకులకు అనుమతి ఇచ్చారు.
టీటీడీపీ నేతలతో భేటీ తరు వాత నేరుగా కాన్వాయ్ తో జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ర్యాలీ వద్దని టీటీ డీపీ నేతలకు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే శనివారం ప్రజాభవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆదివారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు రానున్నారు. అక్కడ పార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం జరగనుంది….