TEJA NEWS

శంకర్‌పల్లి లో జిఎం విజేత సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి చేవెళ్ల రోడ్డులో జిఎం విజేత సూపర్ మార్కెట్ ను స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యలు కలిసి రిబ్బన్ కట్ చేసి లంచనంగా ప్రారంభించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలు సూపర్ మార్కెట్ ను వినియోగించుకోవాలని కోరారు. సూపర్ మార్కెట్ కు వచ్చే కస్టమర్లకు సరసమైన ధరలకు వస్తువులను అమ్మాలని సూచించారు. సూపర్ మార్కెట్ యాజమానులు గోవింద్ రెడ్డి, చంద్రయ్య, సుధాకర్ రెడ్డి, మల్ రెడ్డి లను ఎంపీ, ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. షాపు యజమానులు ఎంపీ, ఎమ్మెల్యేలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

షాపు యజమానులు మాట్లాడుతూ పట్టణ మండల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సూపర్ మార్కెట్ ను ప్రారంభించామని, పేద, మధ్యతరగతి వారికి అన్ని రకాల కిరాణా, జనరల్ వస్తువులు దొరుకుతాయని పేర్కొన్నారు. సూపర్ మార్కెట్ లో రూ. 5000 వస్తువులు కొనుగోలు చేసినచో స్కూటీ కూపన్, రూ. 2500 వస్తువులు కొనుగోలు చేసినచో రిఫ్రిజిరేటర్ కూపన్లు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కే.ఎస్ రత్నం, మండల, మున్సిపల్ బిజెపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS