TEJA NEWS

భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తాత మధుసూదన్ కు మరియు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు కి పంపించారు. ఈ సందర్భంగా చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ త్వరలో భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తానని చెప్పారు. నాకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, యువతకు ధన్యవాదాలు బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


TEJA NEWS