గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరు

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరు

TEJA NEWS

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరులో జిల్లా ప్రజల మన్ననలు పొందిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ .

గత కొన్ని రోజులుగా ముందస్తు పక్కా ప్రణాళికతో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముందుండి నడిపించి జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన గుంటూరు జిల్లా ఎస్పీ .

జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐ.పి.ఎస్., ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో సజావుగా, గుంటూరు జిల్లాలో ఎక్కడా రిపోలింగ్ లేకుండా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన గుంటూరు జిల్లా పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది వారు.

ఎన్నికల విధి నిర్వహణలో తనకు పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసినందుకుగాను జిల్లా పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు మినహా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధులు నిర్వహించడంలో పోలీసు యంత్రాంగానికి జిల్లా ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు అందించిన సహాయ సహకారాలు తీరును పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపి ప్రత్యేకంగా అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్

Print Friendly, PDF & Email

TEJA NEWS