సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
*124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయానగర్ కాలనీలోని కమాన్ టి జంక్షన్ వద్ద పదహారు లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో విష్ణు, రాజ్యలక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…
TEJA NEWS భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు.. మల్కాజ్గిరి…
వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్
TEJA NEWS వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్.. మల్కాజిగిరి :వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట, టాయిలెట్స్…