గుంటూరు జిల్లాలో నేరాల నియంత్రణలో, నేరాల పరిశోధనలో సీసీ కెమెరాలు పాత్ర కీలకంగా మారనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రథాన కూడళ్లలో ఖచ్చితంగా సి సి కెమారాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ అధికారులను ఆదేశించారు
ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని అలా ఏర్పాటు చేయడం వల్ల 24 గంటలు నిఘా వుంటుంది అని జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ అధికారులకు సూచించారు
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు సమిక్షించుకోవాలని అదే విధంగా సీ.సీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
నేరాల నియంత్రణలో, నేరాల పరిశోధనలో సీసీ కెమెరాలు పాత్ర కీలకమని జిల్లా ఎస్పి శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ తెలిపారు.
ప్రస్తుత సమాజంలో నేరాలు జరుగుతున్న తీరు, నేరస్తులు నేరం చేసే విధానం అనేక విధాలుగా ఉంటున్నాయని అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ అధికారులను కోరారు
గుంటూరు జిల్లాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ కెమెరాల ఆదారంగా నేరాలను వేగవంతంగా అరికట్టడానికి మరియు నేరం జరగకుండా తగిన చర్యలు వచ్చునని తెలిపారు.
గుంటూరు జిల్లాలో సీ.సీ కెమెరాల వలన కలిగే ప్రయోజనాల గురించి, వాటి ఆవశ్యకతను గురించి ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
అదే విధంగా సీ.సీ కెమెరాల వలన 24/7 గంటలు నిఘా ఉంటుందని, దుకాణాల వద్ద, ఇంటి పరిసరాలలో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే పటిష్టమైన భద్రత లభిస్తుందని, ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలలు వారి ఇంటి పరిసరాలలో, రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ జిల్లా ప్రజలకు సూచించారు