ధర్మపురి :- ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ .ఈ సందర్భంగా ఈ నెల నాలుగవ తేదిన పెద్దపెల్లి లో జరిగే ముఖ్యమంత్రి సభలో ప్రజలు,పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని సూచించారు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
ఈ నెల నాలుగవ తేదిన పెద్దపెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ వికాస్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ప్రజలకు చేసిన మేలును,అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని,అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చి మాకు ఇవ్వడం జరిగిందని అయినప్పటికీ అప్పులను తీర్తుస్తూ,అట్టి అప్పులకు వడ్డిలను కడుతూ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుందనీ,అయినప్పటికీ కేటిఆర్,హరీష్ రావు మరికొంత మంది బి.ఆర్.ఎస్ నాయకులు ప్రభుత్వం పైన అసత్యాలను ప్రచారం చేస్తూ,బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని,ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీటి విషయంలో తీవ్ర అన్యాయం చేసింది హరీష్ రావు కాదా అని,ఇక్కడి ప్రాంతానికి చెందిన నీటి వనరులను దోచుకొని సిద్దిపేటకు,గజ్వేల్ కి తరలించడం జరిగిందని,పత్తీపాక రిజర్వాయర్ నిర్మిస్తామని ఇక్కడ నిద్ర చేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామి ఇప్పుడు ఎక్కడ పోయిందని,ధర్మపురి నియోజక వర్గానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, చెగ్యం నిర్వాసితులకు 18 కోట్ల రూపాయలు పరిహారం గాని,పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులు గాని,ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సముదామం మంజూరు గాని,నైట్ కాలేజ్ పునః ప్రారంభం గాని ఈ విధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళతామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.