వాళ్ళ జీతాలు పెంచాలని ధర్నా

TEJA NEWS

గిద్దలూరు నియోజకవర్గంలోని కంభంలో కందులాపురం సెంటర్లో అంగన్వాడీలు వాళ్ళ జీతాలు పెంచాలని ఇంకా ఎన్నో అంశాలు మీద కొన్ని రోజులుగా ధర్నా చేస్తా ఉన్నారు… అంగన్వాడీలకు మద్దతుగా సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు మేరకు గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి బట్టిపోతల ఓబులేష్ అధ్యక్షతన సమాజ్ వాది పార్టీ అంగన్వాడీలకు మద్దతు తెలుపడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు అడపాల నాగమణి గారు , జిల్లా నాయకురాలు ఝాన్సీ గారు , నియోజకవర్గ నాయకుడు పల్నాటి పీరా గారు , రెహమాన్ గారు , సమాజ్వాది పార్టీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు , తదితరులు పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలుపడం జరిగింది…. సమాజ్ వాదీ పార్టీ మీకు అండగా ఉంటుంది ఈ సమస్య కాదు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా సరే సమాజ్ వాదీ పార్టీ ప్రతి ఒక్క సమస్యపై స్పందిస్తూ ప్రతి ఒక్కరికి మద్దతుగా ఉంటూ సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు పోతుంది అని నియోజకవర్గ ఇన్చార్జి బట్టి పోతల ఓబులేష్ గారు చెప్పారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page