TEJA NEWS

శ్రీదుర్గాదేవి గోడపత్రికను ఆవిష్కరణ

పరవాడ గ్రామంలో బొంకుల దిబ్బ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయంలో దుర్గాదేవి గోడపత్రికను రాష్ట్ర CEC సభ్యులు పైల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర CEC సభ్యులు పైల శ్రీనివాసరావు మాట్లాడుతూ నవరాత్రుల మహోత్సవ సందర్భంగా బొంకులదిబ్బ దుర్గాదేవి మండపం వద్ద తొమ్మిది రోజులు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని 3 వ తేదీన వెంకటరమణ మూర్తి పాట, 4 వ తేదీన బుర్ర కధ, ,5 వ తేదిన లక్ష దీపారాధన, 6వ తేదీన చిన్న పిల్లల ఆటల పోటీలు, 7 వ తేదీన ఉట్టిపోటీలు, 8 వ తేదీన ముగ్గులు పోటీలు, 9 వ తేదీన సరస్వతి పూజ, 10 వ తేదీన భారీ అన్న సమారాధన, 11 వ తేదీన అమ్మవారి సారె ఊరేగింపు, 12 వ గ్రామ పురవీధుల్లో అమ్మవారి అనుపు మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్య నిర్వాహకులు తెలిపారు.

ఈ యొక్క కార్యక్రమములో జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, మాజీ RECS చైర్మన్ చల్ల కనకరావు, వార్డు మెంబెర్లు పైల వెంకట్రావు,పైల అప్పలనాయుడు సత్యవేణి, పైల హరీష్, వై.సి.పి నాయకులు వర్రీ హరి, పైల ప్రసాద్, పైల చిన్న,బొంకులదిబ్బ యూత్ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS