TEJA NEWS

ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

  • లబ్ధిదారులకు అందజేసిన మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం

ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన పేదలకు ప్రభుత్వం నుంచి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. మధిర నియోజకవర్గానికి సంబంధించి చెక్కులు మంజూరు కాగా.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి హాజరై..అందజేశారు. మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల నుంచి 25 మందికి మొత్తం రూ. 5 లక్షల మేరకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ.. సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని, అంతా ధైర్యంగా ఉండాలని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవరపల్లి అనంతరెడ్డి, బోనకల్ మండల నాయకులు ఉమ్మినేని కృష్ణ, నాయకులు సీతారాములు, మేఘటి శ్రీనివాస యాదవ్, జూలకంటి సంజీవరెడ్డి, మందడపు శ్రీనివాసరావు, రావులపాటి శ్రీనివాసరావు, ఉదయ్ కుమార్, మైనారిటీ నాయకులు మాజిద్, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS