TEJA NEWS

రాజమహేంద్రవరం, తేదీ:14.2.2024

నివాళులు అర్పించిన కలెక్టర్ , ఇతర అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

స్ధానిక కలక్టరేట్ లో బుధవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య సేవలు అందించిన సేవలు సదా ఆచరణీయం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను పురస్కరించుకుని నివాళులు అర్పించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎస్. జ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్న

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.


TEJA NEWS