TEJA NEWS

నకిరేకల్ పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి :-

నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వద్ద నకిరేకల్ మండలానికి చెందిన 73 మంది లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన 23లక్షల, 43 వేల రూపాయల చెక్కులను మరియు కేతేపల్లి మండలానికి చెందిన 40 మంది లభ్దిదారులకు 12 లక్షల 91 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, నకిరేకల్ మండల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, స్థానిక కౌన్సిలర్లు, వివిధ గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-*

23 లక్షల 43 వేలు నకిరేకల్ మండలానికి చెందిన 73 మంది లభ్దిదారులకు అందజేశాం..

12 లక్షల 91 వేల చెక్కులను కేతేపల్లి మండలానికి చెందిన 40 మంది లభ్దిదారులకు అందజేశాం..దాదాపు 500 పైన చెక్కులను 1 కోటి 10 లక్షల చెక్కులను రెండు రోజుల నుండి పంపిణీ చేశాం..గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారివి కూడ ఇవ్వడం జరిగిందిరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు, కరెంట్,ఉచిత గ్యాస్.. లాంటిపథకాలు అమలు చేస్తున్నాం…

మన నియెజకవర్గంలో 30 వేల మందికి రైతు రుణమాఫీ జరిగింది..సంక్రాంతి నాటికి ఎకరానికి 7500 రైతు బంధు ఇస్తాం..గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల అప్పు చేశారు..గడిచిన ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు, కొత్త పింఛన్లు ఇవ్వలేదు

రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది…సొంత జాగ ఉన్న ప్రతీ ఒక్కరికీఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇచ్చి నిర్మాణం చేపడుతాం…బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు పూర్తి చేసి నీరు నింపుతున్నాం,,KTR, హరీష్ రావు నిత్యం ముఖ్యమంత్రి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు

మూసీ ప్రక్షాళన చేస్తుంటే మూసీని అడ్డుకునే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తుందిహైదరాబాద్ నుండి నెమలి కాలువ వరకు ఒక్క చేప కూడా బతుకదు

మూసీని పరిశిలించిన WHO సంస్థ వారు సూపర్ బాగ్ బ్యాక్టీరియా ఉంది అందుకే అనేక రోగాల వస్తున్నాయని నివేదిక ఇచ్చింది…!!మన నియెజకవర్గంలో 80% శాతం మూసి నీరు పారుతుందిఈ జిల్లా మాజీ మంత్రికి ఓట్లు, సీట్లు తప్ప ప్రజల మీద చిత్తశుద్ధి లేదుసోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది

CMRF చెక్కులను అందుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు,,


TEJA NEWS