తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కోడ్ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఈసీ తాజాగా మరో ఐదుగురు సీఐలపై చర్యలు తీసుకుంది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా నేతలు ఫిర్యాదు చేయడంతో.. సీఐలు జగన్మోహన్‌రెడ్డి, అంజూయాదవ్, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…