సాక్షిత పటాన్చెరు :
బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తల బృందం పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీ, గౌతమ్ నగర్ కాలనీ, సీతారామయ్య పురం కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి పదేళ్లలో డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ, కారు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలనుండి అద్భుతమైన స్పందన లభిస్తోందనీ, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి రికార్డు మెజార్టీ అందించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రాంరెడ్డి సతీమణి ప్రణీత రెడ్డి, పటాన్చెరు జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లలితా సోమిరెడ్డి, పటాన్చెరు మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి.
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…