సంతోషాల మధ్య ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం:అర్బన్ సీఐ రమేష్
చిలకలూరిపేట పట్టణ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సవాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కలగ కుండా జరుపుకోవాలని అర్బన్ సీఐ రమేష్ కోరారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ పట్టణ పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీస్ శాఖ తరుపున భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.
ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన, అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయన సరే నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవాలన్నారు.పై అంక్షలను ఎవరైన అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని సీఐ ప్రజలకు సూచించారు.
2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..