ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్
ACB వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరం లో పెట్టింది – వైఎస్ షర్మిలా రెడ్డి
పంజరం నుంచి ACB నీ విడుదల చేయండి – వైఎస్ షర్మిలా రెడ్డి
అదానీ – జగన్ 1750 కోట్ల ముడుపుల పై వెంటనే ACB దర్యాప్తు జరిపించాలి – వైఎస్ షర్మిలా రెడ్డి
అనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన TDP ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోంది – వైఎస్ షర్మిలా రెడ్డి
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
- అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది
- సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యింది
- ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించింది
- ఆధారాలు కూడా బయట పెట్టింది
- ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ?
- ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు ?
- 2021 లో ప్రతిపక్షంలో ఉన్న TDP ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేశారు
- ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు
- రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల ఆర్థిక భారం అని ఆరోపణ చేశారు
- అదానీ డీల్ వెనుక అవినీతి జరిగిందని తెలుసు
- ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు
- కోర్టు కేసు వేసిన పయ్యావుల మంత్రిగా అన్నారు
- అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు?
- జగన్ కి నష్టం లేదు..మీకు నష్టం లేదు
- నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే
- అదానీ తో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన అధికార భారం పడుతుంది
- ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేది
- ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గింది
- రేపు 50 పైసలకే వచ్చినా తగ్గొచ్చు
- సోలార్ పవర్ రెట్లు తగ్గుంటుంటే… మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు ?
- 2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారు.
- చంద్రబాబు ను అడుగుతున్నాం
- అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?
- అదానీ అనే పేరు కూడా ఎందుకు ఉచ్ఛరించడం లేదు ?
- అదానీ బీజేపీ మనిషి..మోడీ మనిషి. బీజేపీ తో మీకు అలయెన్స్ ఉంది
- అందుకే మీరు అదానీ కి, మోడీ కి బయపడుతున్నారు
- అదానీ నీ కాపాడుతున్నారు
- రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నారు
- JPC వేయాలని డిమాండ్ చేస్తున్నారు
- అయినా మోడీనోరు విప్పడం లేదు
- మొత్తం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు
- అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు ?
- ఈ అవినీతి బయట పెట్టని CBI చేతకానిదా?
- మోడీ చేతకాని వాడా ?
- ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ACB కి పిర్యాదు చేసింది
- దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది
- ACB స్వయం ప్రతిపత్తి గల సంస్థ
- కానీ రాష్ట్రంలో ACB నీ బంది చేశారు.
- పంజరంలో చిలక మాదిరిగా బంధి చేశారు
- TDP పంజరంలో ACB బందీ అయ్యింది
- ACB నీ వెంటనే విడుదల చేయండి
- ఏసీబీ ప్రజల కోసం ఉన్న సంస్థ
- ఈ లంచాల వ్యవహారాన్ని ఏసీబీ బయట పెట్టాలి
- ఇప్పటికే రాష్ట్రం నెత్తిన విద్యుత్ చార్జీల భారం మోపారు
- ఈ డీల్ వల్ల 1.50 లక్షల కోట్ల భారం పడుతుంది
- చంద్రబాబు గారు..మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి
- జగన్ తన సొంత ప్రయోజనం కోసం డీల్ చేస్తున్నారు
- ఆయనకు మీకు తేడా లేదు
- ప్రజలు కూటమి నీ నమ్మి రాత్రి 9 గంటల దాకా లైన్లో నిలబడి ఓట్లు వేశారు
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి