అక్రమ మద్యం రవాణా పై ఉక్కు పాదం:-
తిరుపతి జిల్లా
భారీగా ఆంధ్రకు తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత.
చెన్నై నుండి ఆంధ్రకు అక్రమంగా పాండిచ్చేరి మద్యాన్ని తరలిస్తున్న ముద్దాయి అరెస్ట్.
బీవీ పాలెం చెక్ పోస్ట్ వద్ద ఈరోజు తెల్లవారుజామున 00:30 గంటలకు జరిపిన వాహన తనిఖీలలో అక్రమ మద్యాన్ని పట్టుకున్న తడ పోలీసులు.
114 ఫుల్ మద్యం బాటిళ్లు మరియు 10 క్వార్టర్ మద్యం బాటిల్లను స్వాధీనం, సీజ్.
జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., ఆదేశాల మేరకు కేసు వివరాలను వెల్లడించిన నాయుడుపేట డిఎస్పి రాజగోపాల్ రెడ్డి.
అరెస్టు అయిన ముద్దాయి వివరాలు:-
జూపూడి బెబేశ్వర రావు, తండ్రి:పూర్ణ చంద్ర రావు, వయస్సు:43 సం.లు,
రాంబొట్లవారి పాలెం గ్రామము, చెరుకుపల్లి మండలం,
బాపట్ల జిల్లా.