ప్రజా పాలన అంటే ఇదేనా?
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్…
ధర్మపురి
పెగడపల్లి : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు అరవై శాతం అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల యజమానులకు అద్దె బకాయిలు చెల్లించడంలో విఫలం అయినందున విసుగెత్తిన పాఠశాల భవనాల యజమానులు తాళాలు వేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ప్రజాపాలన అంటే ఇదేనా? అంటూ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యమ్ విమర్శించారు. గురుకుల పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకుండా పురుగుల అన్నం తిని వందలాది మంది విద్యార్థులు అస్వస్థత గురైతే నీటి సౌకర్యం లేక విద్యార్థులు స్నానాలు చేయకుండా నీటి ట్యాంకులు పరిశుభ్రంగా లేక పాకురుపట్టిన నీటితో స్నానం చేసి విద్యార్థులు
అంటువ్యాధులకు గురైతే పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల పిచ్చి మొక్కలు మొలిచి విద్యార్థులు పాముకాటుకు గురైతే ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. ఇటీవలే జగిత్యాల జిల్లాలోని జిల్లాలోని పెద్దాపూర్, గొల్లపెల్లి గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థత గురైతే తూ..తూ మంత్రంగా మంత్రులు పర్యటించారే తప్ప ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోకుండా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో కాంగ్రెస్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం గురుకుల పాఠశాలలను భ్రష్టుపట్టించే పనిలో ఉందని విమర్శించారు.ఈ సమావేశంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పల్లె మోహన్ రెడ్డి, పెంట నరేందర్, ఉపాధ్యక్షులు మంద భీమయ్య తదితరులు పాల్గొన్నారు…