TEJA NEWS

పరవాడ సినిమాహాల్ జంక్షన్లో నూతనంగా ఈశ్వర్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభం.

అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన పరవాడ గ్రామం సినిమా హాల్ జంక్షన్ వద్ద బర్నకం గ్రామస్తుడైన నాని రామ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఈశ్వర్ ఫిట్ నెస్ జిమ్ ని ముఖ్య అతిధిలుగా మచిలీపట్నం మాజీ మండల అధ్యక్షులు పంచకర్ల ప్రసాద్ విచ్చేసి తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచకర్ల ప్రసాదను, పైలా జగన్నాథరావును, పరవాడ సర్పంచ్ సరిపరపు అప్పలనాయుడును నాని రామ్ ఘనంగా ఆహ్వానించి సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.ముఖ్య అతిథులుగా విచ్చేసిన కూటమి నాయకులచే జిమ్ కోచ్ అయినటువంటి నాని రామ్ వ్యాయామం చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రంగంలో అయినా మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం అని శారీరకంగా ,మానసికంగా దృఢంగా ఉండడం కోసం ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమానికి పరవాడ సర్పంచ్ సిరపరపు అప్పలనాయుడు, పరవాడ మాజీ జెడ్పీటీసీ & ఆర్ఇసిఎస్ మాజీ చైర్మన్ పైల జగన్నాథరావు, విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లాల కార్యదర్శి బుగిడి రామ గోవిందరావు, పెద్ద చెరువు ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాసరావు, నగిరెడ్డి చిన్నారావు,దాట్ల గణేష్, బోండా తాతారావు, పెద్దిశెట్టి సత్య రావు, పెద్దిశెట్టి శేఖర్, బొండా సన్నిదేవుడు, సత్యారావు (ఎల్ఐసి), పెద్దిశెట్టి రామారావు, శ్రీ పైడిమాంబ హార్డ్వేర్ ప్రోపరేటర్ రెడ్డి నాగేశ్వరరావు, కూటమి నాయకులు, జిమ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS