TEJA NEWS

అదానీతో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నీ రద్దుచేయాలని డిమాండ్ చేసిన AP కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌ షర్మిల #

అదానీ నుంచి జగన్‌కు అందిన ముడుపులు, అర్ధరాత్రి అనుమతులపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. అదానీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల రాష్ట్రంపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ CM కు ఆమె బహిరంగ లేఖ రాశారు

అదానీ నుంచి జగన్‌ 1,750 కోట్ల ముడుపులు అందుకున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసారు.అదానీతో ఒప్పందాల రద్దుతో పాటు ఆ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. గంగవరం పోర్టు అమ్మకంపైనా విచారణ చేయాలన్నారు. జగన్‌ ముడుపులపై దర్యాప్తు చేయిస్తారా లేదంటే అదానీతో అంటకాగుతారా అని CM ను షర్మిల ప్రశ్నించారు


TEJA NEWS