TEJA NEWS

న్యూడ్ వీడియో కాల్ స్కామ్స్ పై జిల్లా SP కి ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా జరిగే స్కామ్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయని , వాటి వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని జిల్లా SP కృష్ణకాంత్, IPS కి ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ .

ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ

  • కొన్ని హానికరమైన యాప్‌లు ప్లే స్టోర్ నుండి నిషేధించబడినప్పటికీ, వారు మోసపూరిత లింక్‌లను ప్రజలకు పంపుతూ , వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ట్రాప్ చేస్తున్నారని కిషోర్ చెప్పారు. అటువంటి మోసపూరిత లింకుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయా యాప్‌ల పేర్లు, వివరాలను పోలీస్ శాఖ వారు బహిర్గతం చేస్తే , ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన సూచించారు.
  • చిన్నారులపై జరుగుతున్న నేరాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు చేస్తున్న నిరంతర కృషి అభినందనీయం అని అన్నారు. అదేవిధంగా, న్యూడ్ వీడియో కాల్ స్కామ్‌ల ప్రమాదాల గురించి కూడా పటిష్టమైన అవగాహన ప్రచారాలను రూపొందించాలని పోలీసు వారిని కోరారు.
  • ఈ స్కామ్‌లు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగించడమే కాకుండా బాధితుల్లో తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఇటీవల, నెల్లూరు వాసులు కొందరు ఈ మోసాలకు బలైపోయారు. ఈ మోసపూరిత కార్యకలాపాలపై కఠినమైన నిషేధాలు మరియు నియంత్రణను విధించాలని పోలీసులను అభ్యర్ధించారు.
  • ఈ విషయంపై స్పందించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, ఐపీఎస్ ఇప్పటికే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, బాధితులు ఎవరైనా ఫిర్యాదు ఇస్తే పోలీసులు బాధితులకు అండగా నిలబడతామని , అలాగే ఈ విషయంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ హామీ ఇచ్చారు.
  • ఈ మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ గారు కోరుతూ ప్రజలకు తగు సూచనలు చేసారు.
  1. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోరాదు.
  2. అనుమానాస్పద వీడియో కాల్‌లు లిఫ్ట్ చేయకూడదు .
  3. తెలియని లింక్‌లకు క్లిక్ చేయకూడదు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న జిల్లా SP కృష్ణకాంత్, IPS కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన గునుకుల కిషోర్

అలాగే మాదక ద్రవ్యరహిత ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తూ నిన్ననే ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్) టీం ని ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన కిషోర్


TEJA NEWS