TEJA NEWS

అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కరణంరెడ్డి నరసింగరావు

గాజువాక 66వ వార్డు అధ్యక్షులు ప్రసాద్ శర్మ ఆద్వర్యంలో కణితి రోడ్డు బివికే హైస్కూలు ఆవరణలో అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు చేతుల మీదుగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో బాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఐదు రోజుల్లో గాజువాక ఇరవై వార్డుల్లో ఆయా ప్రాంత నాయకుల ఆద్వర్యంలో వేల మొక్కలు నాటామని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ ,మండల అధ్యక్షులు గూటూరు శంకరరావు ,ప్రధాన కార్యదర్శి మోటూరు భారతి , ఉపాధ్యక్షులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కరణంరెడ్డి

TEJA NEWS