గురు. జూలై 18th, 2024

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

TEJA NEWS

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

హైవే పై వరుస దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర పార్ధి దొంగల ముఠా అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు.

-జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్.

గత కొంత కాలం నుండి తెలంగాణ రాష్ట్రం లో నల్లగొండజిల్లా లోని చిట్యాల, నార్కెట్ పల్లి, కట్టంగూర్ మండలాలు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లలో మరియు సంగారెడ్డి జిల్లాలో NH-65 పై వాహనములు ఆపి లే-బే పై పండుకున్న వారిని రాళ్ళతో కొట్టి, వారి వద్ద నుండి బంగారం, డబ్బులు దొంగలించుకొనుచు, అదే క్రమంలో తేధి 18-05-2024 న కట్టంగుర్ PS పరిధి క్రైమ్ నంబర్ 76/2024, U/S: 302, 379 IPC R/W 34 IPC లో ఒక TATA మినీ గూడ్స్ వాహనం లో పండుకొన్న కొల్లూరి రాజవర్ధన్ తండ్రి జాన్, 32 సం//లు, నివాసం: చాట్లవానిపురం గ్రామం, పామర్రు మండలం, కృష్ణ జిల్లా, ఆంధ్ర రాష్ట్రం కు చెందిన వ్యక్తి ని కాలు చేతులు కట్టేసి కొట్టి స్క్రూ డ్రైవర్ తో చేతి కి పొడిచి విచక్షణ రహితంగా కొట్టి చంపి అతని వద్ద నుండి 14,500/- దొంగలించుకొని పారిపోయి, దారిలో పామనగుండ్ల గ్రామంలో ఒక హోండా షైన్ బైక్ ను దొంగలించుకొని మరియు ఇంటి ఆరుబయట, ఇంటిలో పండుకున్న వారి మెడ లలో నుండి బంగారం ఆభరణములు, బైక్ లు దొంగలించుచూ పోలీసులకు పెను సవాలు గా మారిన అతి క్రూరమైన నలుగురు (04) పార్ధి గ్యాంగ్ సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరినీ (02) జిల్లా S.P శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు నల్గొండ-DSP శ్రీ.K.శివరాం రెడ్డి గారి పర్యవేక్షణ లో నార్కెట్ పల్లి సర్కిల్ CI శ్రీ.K. నాగరాజు గారి ఆధ్వర్యం లో చిట్యాల SI. D. సైదా బాబు మరియు CCS హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, కానిస్టేబుల్ లు విక్రమ్, సాయి రామ్, చిట్యాల PS హెడ్ కానిస్టేబుల్ మోహసీన్ పాషా లు కలిసి పార్ధి గ్యాంగ్ ఇద్దరు సభ్యులను రాచకొండ కమిషనరేట్ పరిధిలో ORR వద్ద అరెస్టు చేసి వారి వద్ధ నుండి రూ.17 వేల రూపాయలు నగదు, రెండు కత్తెర లు, రెండు వెండి కాళ్ళ పట్టీలు, ఒక చేతి రుమాలు మరియు టార్చ్ లైట్ ను స్వాధీనము చేసుకున్నారు.
నేరస్థుల వివరాలు .
A-1 అప్ప పాండ్రంగా S/o పాండ్రంగా, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: పార్ధి, Occ: కూలీ, R/o బారామతి చౌరత, ఇందాపూర్, పునా జిల్లా., మహారాష్ట్ర రాష్ట్రం.
A-2 శుభం అశోక్ @ దిల్షార్ S/o అశోక్, 25 సంవత్సరాలు, కులం: పార్ధి, Occ: అగ్రిల్., R/o సరస్వతి నగర్, ఇందాపూర్, పునా జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం, N/o దుదోవడి గ్రామం. ఖర్జాత్ (Tq), అహ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం.
A-3 కాశ్మీర్ శశిపాల్ భోంస్లే @ ఖశ్మీర్, S/o శశిపాల్ భోంస్లే, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: పార్ధి, Occ: కూలీ, R/o సంగుల గ్రామం, పండరీపూర్ (Tq) షోలాపూర్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం (పరారీలో ఉన్నారు)
A-4 అధేష్ అనిల్ ఖలే S/o అనిల్ ఖలే, వయస్సు 25 సంవత్సరాలు, కులం పార్ధి, Occ: మేసన్, R/o సరస్వతినగర్, ఇందాపూర్, పూణే జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం (పరారీలో ఉన్నారు)

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page