TEJA NEWS

కుత్బుల్లాపూర్, గాజులరామారం GHMC జంట సర్కిళ్లను ఆకస్మికంగా సందర్శించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..


. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని GHMC గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ కార్యాలయాల్లో ప్రజలు తమ అవసరాల దృష్ట్యా వెళ్ళినపుడు కార్యాలయాల్లో అధికారులు ఎవరు అందుబాటులో ఉండకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని పలువురు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకురావడంతో, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రెండు జంట సర్కిళ్ల కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే విచ్చేసిన సమయంలో ఉదయం 11:00 గం.లు అయినప్పటికీ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గాజులరామారం డిసి మల్లారెడ్డి పై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి జోనల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అదే విధంగా కార్యాలయానికి విచ్చేసిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..

రెండు జంట సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు ఎవరూ ఉండడం లేదని, ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు.
ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను కూడా పక్కన పెట్టేస్తున్నారు..

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కొరకు రోజుకు 18 గంటలు పనిచేస్తే, ఇక్కడి అధికారులు మాత్రం నిద్రపోతున్నారు.

మున్సిపల్ కార్యాలయంలో పలువురు అధికారులు ఇంకా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయమే చెత్త కుప్పగా మారింది. తమ ఇల్లు చక్కదిద్దుకోనోళ్ళు ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు?

ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS