TEJA NEWS

శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి అనుబంధ గ్రామమైన కొజ్జగూడెంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో శివ యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి
కానుక ఇద్దామని చెప్పారు. 6 గ్యారంటీ అమల్లో భాగంగా ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మండల జాయింట్ సెక్రెటరీ హరి, గ్రామ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, నాయకులు ప్రవీణ్, శేఖర్, నరేష్, రాకేష్, శివకుమార్, ప్రసాద్, బబ్లు, జె శివ, తరుణ్, లింగం ఉన్నారు.


TEJA NEWS