మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై డివిజన్ స్థాయి సన్నాహక సమావేశం…
ఈనెల 9వ తేదీన బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపధ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసి డివిజన్లు, నిజాంపేట్ కార్పొరేషన్, కొంపల్లి – దుందిగల్ మున్సిపాలిటీలలో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ వేడుక సన్నాహక సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు.
125 – గాజుల రామారం డివిజన్ లో….
బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమ సన్నాహక సమావేశంలో భాగంగా గాజులరామారం డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం పై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.
126-జగద్గిరిగుట్ట డివిజన్ లో….
ఈనెల 9వ తేదీన గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సన్నాహక సమావేశంలో భాగంగా డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, నాయకులు జైహింద్ లు డివిజన్ కు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయవంతం పై నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
127 – రంగారెడ్డి నగర్ డివిజన్ లో…
మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుక సన్నాహక సమావేశంలో భాగంగా చింతల్ లోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయవంతం పై చేపట్టవలసిన పనులు, చర్యలపై నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాలు, సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
129 – సూరారం డివిజన్ లో…
సూరారం డివిజన్ పరిధి టిఎస్ఐఐసీ కాలనీ సీనియర్ సిటిజన్స్ కార్యాలయం నందు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్దిక్ , మంత్రి అరుణ్ , కాలనీ వెల్ఫేర్ అద్యక్షులు చెక్క సురేష్ బాబు , సీనియర్ నాయకులు బషీర్ , ఫిరోజ్ , మధు మోహన్ , నేతి రాజ , రోషన్ ,అఖిల్ , మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి ,ముకుంద రావు , తాటి రవి , శైనజ్ బేగం , లావణ్య , తారా భాయి , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
130-సుభాష్ నగర్ డివిజన్ లో…
మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవ మరియు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకొని చేపట్టవలసిన చర్యలు, పనులపై సూరారం కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు కార్యక్రమ విజయవంతం పై పలు సూచనలు చేశారు. సమావేశంలో డివిజన్ కు చెందిన సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
131 – కుత్బుల్లాపూర్ డివిజన్ లో…
మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కెఎం.గౌరీష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
132 – జీడిమెట్ల డివిజన్ లో…
మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుక సన్నాహక సమావేశంలో భాగంగా జీడిమెట్ల డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతంపై చేపట్టవలసిన చర్యలపై సమావేశం నిర్వహించారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో…
డిసెంబర్ 9న మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం,మరియు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ సన్నాహక సమావేశంలో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ అధ్యక్షతన, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ తో కలిసి బీఆరెస్ కార్పొరేటర్లు,సీనియర్లు, యువకులు,ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. భాగంగా ఆరోజు నిర్వహించే కార్యక్రమం విజయవంతం చేసే దిశగా తీసుకోవాల్సిన ప్రణాళికలు, సలహాలు,సూచనలు వంటి అంశాలపై అందరూ కలిసి చర్చించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యలు, ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.