TEJA NEWS

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు.

రాయికల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతనంగా రిజిస్ట్రేషన్ చేయగా అట్టి సంఘానికి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యులకు ఆయుష్మాన్ భారత్ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ

జగిత్యాల జిల్లా పరిదిలో ఆయుష్మాన్ భారత్ పథకం లో హాస్పటల్ సంఖ్యను పెంచుదాం అని,సంఘం భవనానికి తన వంతుగా నిదులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకట నరసయ్య ,కార్యదర్శి తాటిపాముల నరసయ్య, కోశాధికారి జోగ మీనయ్య, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS