కొమ్మాలపాటి శ్రీనివాసరావుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ సోదరుడు కొమ్మాలపాటి శ్రీనివాసరావు పెద్దకర్మ కార్యక్రమం పెదకూరపాడులో జరిగింది. వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. కొమ్మాలపాటి శ్రీనివాసరావు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్దఎత్తున తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.