భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ…
-గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే నాని
-నామినేషన్ ర్యాలీ దారి పొడవున….వివిధ రూపాల్లో ఎమ్మెల్యే నానికు నీరాజనాలు పలికిన ప్రజానీకం
-గుడివాడలో నెలకొన్న పండగ వాతావరణం…..జన సునామీని తలపించిన గుడివాడ వీధులు…
-నామినేషన్ ర్యాలీ సూపర్ సక్సెస్ తో…..వైసీపీ శ్రేణుల్లో కదనోత్సాహం….
గుడివాడ25: వేలాదిమంది ప్రజానీకం…. పార్టీ శ్రేణుల ఉత్సాహం… జననీరాజనాల మధ్య గుడివాడ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత రాజేంద్రనగర్ లోని తన స్వగృహం వద్ద భార్య అనుపమ….. ఎమ్మెల్యే కొడాలి నానికు విజయ తిలకం దిద్ది…. మంగళ హారతులు ఇస్తూ నామినేషన్ ర్యాలీను ప్రారంభించారు. జై కొడాలి నాని….. జై జై కొడాలి నాని నినాదాల మధ్య ఎమ్మెల్యే నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది.
గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ దాఖలు సందర్భంగా గుడివాడలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు. భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు…. ప్రజానీకం స్వచ్ఛందంగా తరలి రావడంతో గుడివాడ వీధులు జన సునామీని తలపించాయి. రాజేందర్ నగర్ లోని తన స్వగృహం నుండి బయలుదేరిన ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ ర్యాలీ ఏలూరు రోడ్డు…. నెహ్రూ చౌక్ సెంటర్…. మార్కెట్ రోడ్డు… వాసవి చౌక్… ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్ మీదుగా సాగిన నామినేషన్ ర్యాలీను చూసిన గుడివాడ ప్రజలు విజయోత్సవాన్ని తలపించిందని చెబుతున్నారు. ర్యాలీ సందర్భంగా డిజె సౌండ్లు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో గుడివాడ పట్టణం మోతెక్కిపోయింది.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోయ నృత్యాలు, శక్తి వేషాలు, గర గర నృత్యాలు,కేరళ సాంప్రదాయ వాయిద్యాలు,తీన్మార్ డప్పులు… విచిత్ర ప్రదర్శనలు ప్రజానీకాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ర్యాలీ ఆసాంతం ఎన్టీఆర్ ఫ్యాన్స్… కాపు యువత… వెలమయవత ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ సందడి చేశారు. పార్టీ నాయకులు చింతల భాస్కరరావు.. మట్టా జాన్ విక్టర్…. పేయ్యల ఆదాం… షేక్ బాజీలతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల రిటర్నరింగ్ అధికారి గుడివాడ ఆర్టీవో పద్మావతికి ఎమ్మెల్యే కొడాలి నాని నామినేష్ పత్రాలు దాఖలు చేశారు.వేల సంఖ్యలో వచ్చిన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు……అశేషంగా పాల్గొని విజయవంతం చేసిన ప్రజానీకానికి ఎమ్మెల్యే కొడాలి నాని హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.గత ఎన్నికల్లో వచ్చిన 20వేల…కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ వస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని దీమా వ్యక్తం చేశారు.నామినేషన్ ర్యాలీలో జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక,గుడివాడ, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు, మండలాల వైసిపి అధ్యక్షులు గొర్ల శ్రీను, మట్టా జాన్ విక్టర్, పేయ్యల ఆదాం, సాయన రవి, ఎంపీపీలు గద్దె పుష్పరాణి, కొడాలి సురేష్, జడ్పిటిసిలు కందుల దుర్గా కుమారి, గొల్ల రామకృష్ణ, జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మండలి హనుమంతురావు, పాలేటి చంటి గుడివాడ నియోజకవర్గ పరిధిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు….పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు….పార్టీ అనుబంధ కమిటీల నాయకులు….ఎమ్మెల్యే కొడాలి నాని అభిమానులు…. వేలాదిగా వైఎస్ఆర్సిపి శ్రేణులు…. అశేషంగా ప్రజానీకం పాల్గొన్నారు.