TEJA NEWS

దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
*సారెగూడెంలోని శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ *

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సారెగూడెంలోని శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవ బోనాల పండుగ జాతరలో ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, సాయి యాదవ్,బౌరంపేట్ పాక్స్ చైర్మన్ మిద్దుల బాల్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వార్డ్ సభ్యులు శ్రీశైలం, వీరాస్వామి, నాగార్జున, రామ్ బాబు,పాక్స్ డైరెక్టర్లు వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షులు మచ్చేందర్, అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS