TEJA NEWS

మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే?

ఇటీవల APCC చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. సన్నిహితుల సూచన మేరకు సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు వైసీపీ అధిష్ఠానం కూడా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో నిర్ణయం ఉంటుందని సమాచారం. అయితే ఆర్కే తిరిగి సొంతగుటికి చేరుతున్నట్లు సమాచారంతో టీడీపీ లో కొంత ఆలజడి మొదలైంది. ఇప్పటి వరకు గెలుపు ఖాయం అనుకున్న టీడీపీ ఇప్పుడు డైలమాలో పడింది.

అయితే లోకేష్ కు సొంత పార్టీ, కొంత భజన బృందం వలనే చాలా నష్టాలు అని టీడీపీ లోని కొందరు నేతలు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. కనీసం ఇప్పటికైనా సొంత పార్టీ గెలుపుకు కృషి చేస్తారో లేక మా పంథా ఇంతే అనేది ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి.


TEJA NEWS