TEJA NEWS

Bala showry: పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైకాపాకు రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు..

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్‌తో బాలశౌరి భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం..

సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన బాలశౌరి వైకాపాకు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఆయన బందరు నుంచి బరిలోకి దిగుతారా? లేదా సొంతూరు గుంటూరుపై గురిపెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది..


TEJA NEWS