ఎన్నికల బరిలోకి నారా బ్రహ్మణి..?
ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
అయితే ఈసారి టీడీపీ యువనేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది.
సీనియర్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే నారా బ్రాహ్మణికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోందని సమాచారం.
విశాఖ లేదా విజయవాడ నుంచి పోటీ చేయించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.