TEJA NEWS

త్వరలోనే నూతన టెక్స్ టైల్స్ పాలసీ

  • అసెంబ్లీలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
  • త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటు
  • ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు
  • చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు..
  • చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందజేయబోతున్నాం : మంత్రి సవిత

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యుల అడిగిన ప్రశ్నలకు సందిస్తూ మంత్రి సవిత సమాధానాలు

• 2015 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేనేతలకు ఆసరాగా ఉండేలా ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు 90 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
• తరవాత జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల మాదిరిగా చేనేత రంగం కూడా పూర్తిగా నిర్వీర్యమైందన్నారు.
• పేదల ఇళ్ల పేరుతో ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కులో 14 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించింది.
• ఈ నిర్ణయంపై మేం కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి… టెక్స్ టైల్స్
• పార్కు భూములు కాపాడాం.
• గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మిగనూరులో కచ్చితంగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేయబోతున్నాం… 5 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాం.
• ఎమ్మిగనూరుతో పాటు రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్
• పార్కుల ఏర్పాటు చేయబోతున్నాం
• చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు కూడా ఏర్పాటు చేయబోతున్నాం
• చేనేతలను అన్ని ఆదుకోవాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం
• త్వరలోనే టెక్స్ టైల్స్ పాలసీ తీసుకురాబోతున్నాం..
• చేనేతలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న లక్ష్యంతో…దూరదృష్టితో
• 2014-19లో రాష్ట్ర వ్యాప్తంగా టెక్స్ టైల్స్ పార్కులు నిర్ణయించాలని సీఎం చంద్రబాబునాయుడు అప్పట్లో నిర్ణయించారు..
• తరవాత వచ్చిన జగన్ వాటిని అభివృద్ధి చేయకపోగా, వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
• ప్రభుత్వ భూములు కబ్జా చేయడం…దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరే అభివృద్ధి పనులు చేపట్టలేదు…
• మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ వీవర్ శాల ఏర్పాటు చేసి… చేనేతలకు అండగా నిలిచారు…
• అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది…
• ఇప్పటికే కొందరు ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి వీవర్ శాలల ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు
• ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి సంస్థల సాయంతో రాష్ట్రంలో పలుచోట వీవర్ శాలలు, కస్టర్లు ఏర్పాటు చేయబోతున్నాం
• కేంద్ర ప్రభుత్వ నుంచి నేతన్నల సంక్షేమానికి కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురాబోతున్నాం
• చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందజేయబోతున్నాం
• ధర్మవరంలో మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటుకు రూ.30 కోట్ల నిధులను కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంజూరుకు కృషి చేశారు
• చేనేత రంగానికి, నేతన్నకు తమ ఎన్డీయే ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకురానుంది.


TEJA NEWS