TEJA NEWS

నూతన ఏడాది క్యాలెండర్ ఆవిష్కరించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .

జి.కొండూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అంకెమ్ సురేష్ , గ్రామ పార్టీ అధ్యక్షుడు పజ్జూరు వెంకటేశ్వరరావు (బుల్లి) రూపొందించిన నూతన ఆంగ్ల ఏడాది 2025 క్యాలెండర్ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆవిష్కరించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని టీడీపీ నాయకులు ప్రత్యేకంగా కలిసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ పురోగమిస్తుందని శాసనసభ్యులు కృష్ణప్రసాదు పేర్కొన్నారు. నూతన ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS