పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాకలు చేసిన బిబి పాటిల్ తదనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించిన
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి బి పాటిల్
గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న కార్యకర్తలు జహీరాబాద్ సీటును మోదీకి బహుమతిగా ఇద్దాం
సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమం కోసం మోదీ కృషి
కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పైడి ఎల్లారెడ్డి
కార్యక్రమాన్ని ఉద్దేశించి డా. పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ
సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమం కోసం మోదీ గత పది సంవత్సరాలుగా విశేషంగా కృషి చేస్తున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. జహీరాబాద్ లో వలసల జోరు ఊపందుకుంది. గత పదేళ్లలో జహీరాబాద్ నియోజకవర్గంను అభివృద్ది చేసేందుకు ఎన్నో
ఆటుపోట్లను బి బి పాటిల్ ఎదుర్కొన్నారు ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ నిధులు తీసుకు వచ్చి నియోజకవర్గంను మరింత అభివృద్ధి చేయడానికి మోడీకి జహీరాబాద్ సీటును బహుమతిగా ఇద్దామని పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు ఇంత పెద్ద క్యాడర్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రతీ ఒక్క నాయకులును కలుపుకుని పార్టీ ఇచ్చిన ప్రతి పని చేస్తానని స్పష్టం చేశారు.