TEJA NEWS

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 130 – సుభాష్ నగర్ డివిజన్ కృషి కాలనీ నందు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులైన ఈటల, పట్నం సునీత మహేందర్ రెడ్డిలు రాజకీయాల కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తారు తప్పా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని ఇందుకు నిదర్శనం గత ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచిన రేవంత్ రెడ్డి గారేనని, ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఏ రోజు నియోజకవర్గంలో తిరిగింది లేదని, ప్రజా సమస్యలను పట్టించుకున్నది లేదన్నారు. కానీ మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గత 25 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని ఇలాంటి వ్యక్తిని మనం మే 13న జరిగే ఎన్నికల్లో గెలిపించుకుంటే ప్రజా సమస్యల పరిష్కారమవుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జి. హేమలత సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు పందిరి యాదగిరి, వెంకటస్వామి, ప్రభాకర్, రాజ్ కుమార్, గుబ్బల లక్ష్మీనారాయణ, శివాజీ, చారి, మంగ, మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS