TEJA NEWS

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ బీఫారం అందుకున్నారు.. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుండి రూ.95లక్షల చెక్కును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందజేశారు.

అంతకుముందు జరిగిన సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు,విధానాలపై గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు వివరించారు..

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్,ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్,కార్పోరేటర్లు,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు..


TEJA NEWS