TEJA NEWS

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్

★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 66 ఫిర్యాదులు అందాయి.

★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

★ నరసరావుపేటకు చెందిన ఇద్దరు మగ ఒక ఆడ సంతానము. వారిలో రెండవ కుమారుడు జులాయిగా తిరుగుతూ ఏ పని చేయకుండా ఇంట్లో డబ్బులు,బంగారం ఎత్తుకొని తాకట్టు పెడుతున్నట్లు, మద్దతుగా ఫిర్యాదు భార్య ప్రస్తుతం ఉంటున్న ఇల్లు రాసి ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఎస్పీ ని న్యాయం చేయవలసిందిగా అర్జీ ఇవ్వడం జరిగింది.

★ సత్తెనపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన షేక్ నాజియా బేగం కు
నాగుర్ వలి తో వివాహం అయినట్లు, వివాహం తర్వాత ఫిర్యాదు భర్త కొడుతూ, తిడుతున్నట్లు, వివాహానికి ముందు వేరొక అమ్మాయి తో అక్రమ సంబంధం ఉండటం వలన ఫిర్యాది ప్రమేయం లేకుండా విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని వివాహం చేసుకున్న తన భర్త పై చర్యలు తీసుకోవాలని భర్తకు సహకరించిన ఫిర్యాదు అత్తమామలు, మేనత్త-మేనమామ మీద చర్యలు తీసుకోనవలసిందిగా ఫిర్యాదు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

★ పొదిలి పట్టణం నవాబుకట్ట కు చెందిన ముల్లా కాలేషా వలి సంగీత్ మొబైల్ స్టోర్ ఏరియా సేల్స్ మేనేజర్ గా సంవత్సరం నుండి పనిచేస్తున్నట్లు, నరసరావుపేట లో ని సంగీత్ మొబైల్ స్టోర్స్ కూడా అతని పరిధిలో చెకింగ్ లో భాగ ంగా నాలుగు నెలలకు చెక్ చేయగా 1,60,000/- లు స్టోర్ మేనేజర్ అయిన జల్ది మహేష్ తన సొంత ఖర్చులకు వాడుకొని చేసిన నేరం అంగీకరించినట్లు, వాడుకున్న డబ్బులు పది రోజులలో చెల్లిస్తానని చెప్పి డబ్బు చెల్లించకుండా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పకుండా ఉండగా అతని వద్ద డబ్బులు రికవరీ చేయాలి అని ఒత్తిడి పెరగడం వలన ఫిర్యాదు తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.

★ బెల్లంకొండ మండలం శ్రీ రామాంజనేయ పురం గ్రామానికి చెందిన సిరియాల యేలమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండగా బోమ్మిడి సుబ్బారావు అతని అనుచరులు ఇంటిలోనికి వచ్చి నీ మొగుడు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేసినట్లు, అదేవిధంగా పొలం లో వేసిన పైరను కూడా నాశనం చేసినందుకు గాను ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

★ పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఆంజనేయులు మరియు అతని స్నేహితులకు కలిసి సాఫ్ట్వేర్ తో వేల కొరకు గుంటుపల్లి వెంకట మల్లికార్జున రావు అనే వ్యక్తికి 18 లక్షల రూపాయలు కట్టినట్లు, డబ్బులు తీసుకున్నటువంటి గుంటుపల్లి వెంకట మల్లికార్జున రావు ఉద్యోగాలు ఇప్పించకుండా ఫిర్యాది అడిగిన ప్రతిసారి ఏ సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గా ను సదరు విషయమై ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

★ దుర్గి మండలం అడిగోప్పల గ్రామానికి చెందిన వడ్లమూడి భూలక్ష్మి కి గురజాల మండలం పులిపాడు గ్రామంలో 19 సెంట్ల స్థలం ఉన్నట్లు, ఆ స్థలం విషయంలో మర్యాద బాబాయి ఫిర్యాదుతో నీకేం సంబంధం మీ నాన్న నాకు ఇచ్చాడు అని ఫిర్యాదును కొట్టి బెదిరించినందుకు గాను ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

★ వినుకొండ పట్టణానికి చెందిన వరికుంట కృష్ణ తన తమ్ముడి ద్వారా పరిచయం అయిన అక్షయ ప్యాలెస్ హోటల్ నడుపుతున్న G.శ్రీనివాస రావు కు వ్యాపార అవసరం నిమిత్తం 9,50,000/- లు చేబదులు ఇచ్చినట్లు, డబ్బులు ఇచ్చి ఐదు సంవత్సరాలు అయిననూ ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిని పిలిపించి తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.

★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు దూర ప్రాంతాల నుండి వచ్చిన అర్జీ దారులకు దాతల సహాయంతో భోజన ఏర్పాట్లను చేసినారు.


TEJA NEWS