అమరావతి:
తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే..
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమై చర్చించారు.
మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచిన జనసేనాని.. స్థానిక ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. విజయవాడ పశ్చిమ సీటు కోసం పోతిన మహేశ్ పవన్‌ను కలిశారు. మరో రెండ్రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తునట్టు సమాచారం. మార్చి 30న పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.