వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Spread the love

58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పంచామని తెలిపారు. 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని జగన్ పేర్కొన్నారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే దుష్టచతుష్టం అడ్డుపడుతోందని మండిపడ్డారు. దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధంగా ఉన్నాడని సీఎం జగన్ హెచ్చరించారు.

మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసే వారే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్ధులని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను 45 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకువస్తుందని, ఆ తర్వాత అది చెత్త బుట్టకేపరిమితమవుతుందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకానందారెడ్డిని హత్య చేసిందే ఎవరో అందరికి తెలుసున్నారు. హంతుకుడికి తన ఇద్దరి చెల్లెమ్మలు మద్దతు ఇస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Print Friendly, PDF & Email