పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పొద్దుటూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు, పొద్దుటూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఒక్క ఓటరు ను కలుస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాలను క్షుణ్ణంగా వివరిస్తూ, మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వం లోని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని, సుస్థిర పాలన కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని వివరించారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా, చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా నరేంద్ర మోడీ బలపరిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం పువ్వు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుందామని, ఓటర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జ్ ఏనుగు సంజీవరెడ్డి, బిజెపి గ్రామ పార్టీ అధ్యక్షులు పులకండ్ల సుధాకర్ రెడ్డి, బూత్ నెంబర్ 100 అధ్యక్షులు నగేష్ ముదిరాజ్, బూత్ నెంబర్ 101 కార్యదర్శి చాకలి శ్రీకాంత్, బిజెపి సీనియర్ నాయకులు మేకల గోపాల్ రెడ్డి ఏనుగుమహేందర్ రెడ్డి, మండల బిజెపి ఉపాధ్యక్షులు సింహం రాజు, మోటె యాదయ్య, ఏనుగు కాంతి రెడ్డి,ఎనికెపల్లి రాఘవేందర్, శ్రీకాంత్, పెద్దలు పట్నం మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,
ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న, పొద్దుటూరు బిజెపి నాయకులు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…