AP:జల్లెడపడుతున్న పోలీసులు భారీగా బైండోవర్ కేసులు

AP:జల్లెడపడుతున్న పోలీసులు భారీగా బైండోవర్ కేసులు

TEJA NEWS

AP: There are a lot of bindover cases being investigated by the police

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు..

ఇక, పల్నాడు జిల్లాలో పోలీసులను కౌంటింగ్ ప్రక్రియ టెన్షన్ పెడుతుంది. పోలింగ్ పూర్తైన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకున్న పోలీసులకు నాయకులు షాక్ ఇచ్చారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరగటంతో మరింత అప్రమత్తం అయ్యారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సెలవులు ఇచ్చేది లేదని పోలీస్ శాఖ తేల్చి చెప్పేసింది. మరోవైపు స్ట్రాంగ్ రూములపై డ్రోన్ ల ఎగరవేత కూడా నిషేధించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ లు చేస్తున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. పోల్ డే హింస నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. హింసాత్మక ఘటనలు, ఎన్నికల కమిషన్ (ఈసీ) వేటుతో పోలీసుల్లో వణుకు మొదలైంది. మూల మూలలా కార్డాన్ చర్చ్ కొనసాగిస్తున్నారు. అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. కౌంటిగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారందర్నీ పోలీస్ స్టేషన్లకు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన ఎన్నికల నేరాలకు పాల్పడే వారిని దూరంగా ఉండే స్టేషన్లకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై ఏపీ పోలీసులు నిషేధం విధించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS