TEJA NEWS

నిర్వహణ కొరవడిన ట్రాఫిక్ సిగ్నల్స్
ప్రమాదాలకు నెలవుగా మారిన కూడళ్ళు

సిగ్నల్స్ నిర్వహణ మాది కాదు అంటున్న పోలీసు, మున్సిపల్ అధికారులు మరో ఏడూ సిగ్నల్స్ ఏర్పాటుకు పాయింట్స్ గుర్తింపు
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీకి అర్జీలు పెట్టిన రాజకీయ పార్టీలు

వనపర్తి :
వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ చాలాకాలంగా పనిచేయడం లేదని దీంతో ఈ చౌరస్తా గూడ హైదరాబాదు కొల్లాపూర్ మహబూబ్నగర్ కొత్త బస్టాండు పెబ్బేరు కర్నూల్ ఇతర ప్రాంతాలకు వాహనాలు పాదాచారులు వెళుతుంటారు ఇదే చౌరస్తా లో అన్ని పార్టీల కు సంబంధించిన ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు మానహారాలు కొవ్వొత్తుల ప్రదర్శనలు జయంతులు వర్ధన్తులు లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఈ క్రమంలో ఆర్టీసీ వాహనాలు వాహనాల దారులు పాదాచారులు ఈ కూడలి దారి గుండా వెళ్లే క్రమంలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారని వినాయక చవితి కృష్ణాష్టమి ముస్లింల ప్రదర్శనలు ఇతర ఏ కార్యక్రమాలు అయినా రాజీవ్ చౌరస్తా ప్రధానవేదికగా ఎన్నికల సమయంలో రోడ్ షోల్గా మారుతూ ఉంటుంది ఈ చౌరస్తా, అలాంటి ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోవడంతో జెండా వినాయక, పీర్ల పండగ ఇతర పండుగలు ఇతరత్రా సమయాల్లో యువకులు ఆనందంతో ద్విచక్ర వాహనాలపై కేరింతలు కొడుతూత్రిబుల్ రైడింగ్ చేస్తూ ఉంటారు ఇదే క్రమంలో రాజీవ్ చౌరస్తా తో పాటు అంబేద్కర్ చౌరస్తా గాంధీ చౌక్ వివేకానంద చౌరస్తా భగీరథ చౌరస్తా ల వద్ద ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి

ఈ ప్రమాదాలలో కాళ్లు చేతులు పోగొట్టుకున్న వారితో పాటు మరణించిన వారు కూడా ఉన్నారు ప్రమాదాల్లో నష్టపోయిన కుటుంబాల మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణలో ప్రమాదాలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసు మున్సిపల్ ఉన్నతాధికారులకు శాపనార్థాలు పెడతా ఉన్నారు ఇదే విషయంపై పోలీస్ అధికారులను మున్సిపల్ అధికారులను వివరణ కోరగా నిర్వహణ మాది కాదంటే మాది కాదంటూ అంటూనే జిల్లాలో లేని ట్రాఫిక్ శాఖపై తప్పిదాలను తోసేస్తూ చేతులు దులుపుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ మాత్రం జిల్లా కేంద్రంలో మరో ఏడు ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయడానికి పాయింట్లు గుర్తించడం జరిగిందని వాటిని ఏర్పాటు చేయడానికి త్వరలో టెండర్లను పిలవడం జరుగుతుందని ప్రస్తుతం పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ని బాగు చేయించేందుకు కూడా టెండర్ వేయాల్సిందేనని తెలపడం విశేషం
వనపర్తి పట్టణం జిల్లాగా ఏర్పడి దాదాపుగా 8 సంవత్సరాల కావస్తుందని జిల్లాలో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని దీంతోపాటు వాహనాల రాకపోకలు ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రధాన కూడళ్ల వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి వాటిని అరికట్టాలని
ఎస్పీకి రాజకీయ పార్టీల నాయకులు పోలీస్ ప్రజావాణిలో విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకు స్పందించిన ఎస్పీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు ఆవశ్యకతను సంబంధిత శాఖకు నివేదిక పంపిస్తామని తెలిపారు అంతవరకు ఎంతమంది ఎన్ని ప్రాణాలు నష్టపోవాలో ఎన్ని కుటుంబాలు వీధిన పడాలో అన్న అనుమానాలు పట్టణ ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.


TEJA NEWS