TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని గాగిల్లాపూర్ 1వార్డులోని జగన్ వెంచర్ లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ కుంటి అరుణ నాగరాజు తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. కాలనీలో పర్యటించి కాలనీ సభ్యులు మరియు స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు..


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భారత్ కుమార్, సీనియర్ నాయకులు మురళి యాదవ్, ఎక్స్ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, నాయకులు మొర అశోక్, లక్ష్మణ, కోటేశ్వర్ రావు, గణేష్, జ్ఞానేశ్వర్, ఏ శ్రీనివాస్ గౌడ్, మరియు స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….


TEJA NEWS