కోటి రూపాయల విలువ చేసే ఆస్తి ని..బసవతారకం ఆస్పత్రికి రాసిన ..రమాదేవి
గుంటూరు తెనాలికి చెందిన పి. రమాదేవి రూ. కోటి విలువ చేసే ఆస్తిని దానం చేశారు.
తన తదనంతరం ఆస్తి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందేలా రాసిన వీలునామాను సోమవారం ఆమె సంరక్షకులు సీఎం చంద్రబాబుకు అందజేశారు.
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన రమాదేవికి ముగ్గురు కుమారులు.
వారు అమెరికాలో స్థిరపడ్డారు.
ఈ క్రమంలో ఆస్తిని ఆస్పత్రికి అందిస్తున్నట్లు ఆమె తెలిపారు