TEJA NEWS

పైడివాడ అగ్రహారం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ సదస్సు

పైడివాడ అగ్రహారం గ్రామ రెవిన్యూ పరిధిలో ఈరోజు రీ- సర్వే మరియు ఇతర భూ సమస్యల పరిష్కారం కొరకై గ్రామసభ నిర్వహించారు. ఈ రెవిన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం సాధ్యమైనంత వరకు పరిష్కారం అవుతాయని రీ-సర్వే డిప్యూటీ తాసిల్దార్ గణేష్ గారు మాట్లాడుతూ ఈ సందర్భంగా రైతులు సందేహాలను నివృత్తి వృత్తి చేశారు. ఈ గ్రామంలో మొత్తం భూమి 538.55 ఎకరాలు ఉండగా ఇందులో ప్రభుత్వానికి చెందినది 228.31 ఎకరాలు జిరాయితీ భూమి 310.24 ఎకరాలు ఉందన్నారు. పాత సర్వే నెంబర్లు:148 ఉండగా మొత్తం 537 ఖాతాలు ఉండగా 2342 ఎల్.పి.ఎం .లు ఇచ్చినట్లుగా వివరించారు. మండల సర్వేయర్ అప్పారావు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రీ-సర్వేను కొన్ని గ్రామాల్లో నిర్వహించినప్పటికీ అనేక పొరపాట్లు జరిగాయని తక్కువ సమయం రీ-సర్వే పూర్తి చేయమని ఒత్తిడి తేవడం వల్ల ఈ పొరపాట్లు జరిగాయని వీటిని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రత్యేకంగా ఈ గ్రామ సభలను నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించిందని ఉన్నారు. గ్రామ ఎంపీటీసీ సభ్యులు సీరం అప్పలరాజు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం హయాంలో జరిగిన భూముల రీ -సర్వే ప్రక్రియలో జరిగిన తప్పుదాలను సరిదిద్దరమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులో నిర్వహిస్తుందని గతంలో రైతులకు జరిగిన తప్పులను సవరించాలని అధికారులను కోరారు. ఈ రెవెన్యూ సదస్సులో రైతులు వద్ద నుంచి 103 వినతులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు అక్కిరెడ్డి రామలక్ష్మి దుర్గినాయుడు, జనసేన నాయకులు, సరిపల్లి విష్ణు, పచ్చికోరు సన్యాసినాయుడు, గండ్రెడ్డ్ పెద అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతిన పైడిరాజు , బొబ్బరి మహేష్, పెచ్చెట్టి మహాలక్ష్మి నాయుడు, గండ్రెడ్డ్ చిన్నారావు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


TEJA NEWS