TEJA NEWS

ఇసుక త్రవ్వకం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించవద్దని,
ఇసుకపై అన్ని రకాల పన్నులు ఎత్తివేయాలని,
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని
ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ 11వ తేదీ రాష్ట్రం వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం పలనాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చిలకలూరిపేట నియోజకవర్గ ఏఐటియుసి అధ్యక్షులు పేలూరి రామారావు తెలిపారు. ప్రభుత్వం ఇసుక విధానంలో అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలపై మరింత భారం పడటమే కాకుండా భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం కూలి పనులు లేక కార్మికుల కుటుంబాలు పస్తులు ఉంటున్నారని అన్నారు.ఈ సందర్భంగా పట్టణంలోని కళామందిర్ సెంటర్ వద్ద ఆయన కార్మికులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కాసా సాంబయ్య, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు తూబాటి సుభాని, యూనియన్ నాయకులు పల్లపు వీరయ్య, వేజెండ్ల నరేంద్ర, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS